August 22, 2025 2:34 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

TTD: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఎప్పటినుంచంటే..!

భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో త్వరలో వేంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి సన్నాహాలు చేస్తోంది టీటీడీ. ఈ క్రమంలోనే టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి వెంకయ్య చౌదరి అధ్యక్షతన.. టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు వెంకయ్య చౌదరి.

 

వచ్చె నెల అంటే సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 23న జరగనున్న అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24న ‘ధ్వజారోహణం’, పెద్ద శేషవాహన సేవ జరగనుండగా.. సెప్టెంబర్ 25న చిన్న శేష వాహనసేవ, హంస వాహనసేవ జరగనుంది. ఇక సెప్టెంబర్ 26న ఉదయం సింహ వాహనసేవ.. సాయంత్రం ముత్యపు పందిరి వాహనం సేవ జరగనుంది.

 

అదేవిధంగా సెప్టెంబర్ 27న కల్పవృక్ష వాహనం సేవ, సర్వభూపాల వాహనం సేవ, సెప్టెంబర్ 28న మోహిని అవతారం, గరుడ వాహన సేవ జరగనుంది. ఇక 29న హనుమంత వాహనసేవ, స్వర్ణ రథోత్సవం, గజవాహన సేవ జరగనుండగా.. 30న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవ జరగనుంది. ఇక అక్టోబర్ 1న రథోత్సవం, అ్వవాహన సేవ జరగనుండగా.. 2న చక్రస్నానం, ధ్వజారోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

Share This Post