భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం మూడో రోజు కూడా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరులోని నక్క వాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు 25 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆలయ గర్భగుడి ముందు ఉన్న నదీపాయ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో, భక్తుల కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి, దర్శనానికి అనుమతించారు. వనదుర్గ ఆనకట్ట, ఆలయం వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. వరద తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యథావిధిగా ఉంటుందని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మరిన్ని కథనాలు