August 22, 2025 2:33 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Vishwambhara: చిరు విశ్వంభర గ్లింప్స్ అదుర్స్

భారత్ సమాచార్.నెట్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. చిరు పుట్టిన రోజు కానుకగా.. విశ్వంభర్ గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

 

అసలేం జరిగిందో ఈరోజైనా చెబుతావా అనే డైలాగ్‌తో విశ్వంభర గ్లింప్స్ ప్రారంభమైంది. గతంలో వీఎఫ్ఎక్స్‌ విషయంలో విమర్శలు తలెత్తగా.. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో ఆ తప్పులను సరిచేసుకుంది చిత్ర యూనిట్. వీఎఫ్ఎక్స్‌కు అధిక ప్రాధాన్యమిస్తూ మూవీ తెరకెక్కినట్లు లేటెస్ట్ గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. 14 లోకాలకు మూలమైన బ్రహ్మదేవుడి సత్యలోకాన్ని ఇందులో హైలెట్‌‌గా చూపించారు.

 

ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్, సాంగ్స్ ఈ చిత్రంపై భారీ హైప్ క్రియేట్ చేయగా… తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్ చిరు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇక విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిరంజీవి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. బెస్ట్ క్వాలిటీతో మువీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సినిమాను విడుదలకు సమయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు చిరు. ఇక తెలుగుతో పాటు ఇతర భాషలల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

 

To Watch Vishwambhara Glimpse Click the Link Below: 

https://youtu.be/WPWNt8qhx94

 

 

మరిన్ని కథనాలు:

Vishwambhara: విశ్వంభర సెట్స్‌లో బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ!

Share This Post