భారత్ సమాచార్.నెట్, ప్రకాశం: మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం సాయంత్రం మహిళల కోసం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని (ఉచిత బస్సు ప్రయాణం) ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్ సారథ్యంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ‘తల్లికి వందనం’ వంటి పథకాలు మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని అన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని, వారి తీరును అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం నరసింహులు, సీఐ ధనలక్ష్మి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు