Homemain slidesతమ్ముడిని డాక్టర్ చేయాలని.. ఊహించని ట్వీస్ట్

తమ్ముడిని డాక్టర్ చేయాలని.. ఊహించని ట్వీస్ట్

 సమాచార్.నెట్, రాజస్థాన్ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ కొలువు సాధించాలని యువతీ యువకులు నిరంతరం కఠోర సాధన చేసి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుని విజయం సాధిస్తున్నారు. ఇంకొందరూ కోచింగ్ తీసుకుని ప్రణాళిక బద్ధంగా చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచిపేరు ప్రఖ్యాతలను తీసుకువస్తున్నారు. మరికొందరు అడ్డదారుల్లో ప్రభుత్వ కొలువులు సాధించాలని ఒకరి రాయాల్సిన పరీక్షను మరొకరు రాస్తూ కటకటాలపాలవుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ పట్టణంలో చోటుచేసుకుంది. దేశ వ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 5న జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్‌లో ఓ విద్యార్ధికి బదులు మరొక విద్యార్ధి పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ్ముడు నీట్ పరీక్ష రాయవల్సి ఉండగా అన్నయ్య హాజరయ్యాడు. అసలు అభ్యర్ధికి బదులు డూప్లికేట్ అభ్యర్థి పరీక్షకు హాజరైనట్లు పరీక్ష నిర్వహణ అధికారులు తేల్చారు. వెంటనే పోలీసులను పిలిపించగా.. సోదరులిద్దరినీ అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

అస్సలు నిజం తెలిసిందిలా:
నీట్ యూజీ పరీక్ష కోసం బార్మర్‌లో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన అంత్రిదేవి ప్రభుత్వ హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో చోటుచేసుకుంది. పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థిపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా.. అతను నకిలీ అభ్యర్థిగా తేలింది. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు అతడిని అదుపులోకి విచారించగా.. నిజం అంగీకరించాడు. తన పేరు భగీరథ్ రామ్ అని.. తన తమ్ముడు గోపాల్ రామ్ స్థానంలో డమ్మీ అభ్యర్థిగా పరీక్ష రాసేందుకు వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. కాగా భగీరథ్ రామ్ గతేడాదే నీట్‌ యూజీ పరీక్షను క్లియర్‌ చేశాడు. అనేక ప్రయత్నాల తర్వాత అతడు NEET పరీక్షలో విజయం సాధించాడు. ప్రస్తుతం జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో భగీరథ్ రామ్ ఎంబీబీఎస్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాడు.

తమ్ముడిని డాక్టర్‌ను చేయాలని:
తమ్ముడి స్థానంలో పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన భగీరథ రామ్ అనేక ప్రయత్నాల తర్వాత గతేడాది జరిగిన నీట్ యూజీ పరీక్షలో విజయం సాధించాడని, జోధ్‌పూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. తన తమ్ముడిని డాక్టర్‌ని చేసేందుకు, అతడి స్థానంలో నకిలీ అభ్యర్థిగా పరీక్ష రాయడానికి వచ్చి పట్టుబడినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు భగీరథ్‌తోపాటు, అతడి సోదరుడు గోపాల్ రామ్‌తోపాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరికొన్ని కథనాలు:

ఇదో కొత్త రకం మోసం బాసు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments