August 22, 2025 11:29 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

India-China: ఐదేళ్ల తర్వాత పున:ప్రారంభమైన భారత్-చైనా ట్రేడ్ మార్గాలు

భారత్ సమాచార్.నెట్: భారత్, చైనా మధ్య గత కొంతకాలంగా నిలిచిపోయిన సరిహద్దు వాణిజ్యం తిరిగి ప్రారంభమైంది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్న మూడు సరిహద్దు వాణిజ్య కేంద్రాలు తాజాగా తెరుచుకున్నాయి. ఈ పరిణామంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలకే కాకుండా టిబెట్ ఆర్థిక వ్యవస్థకు, భారత్, చైనా ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరనుంది. వాణిజ్యం తిరిగి ప్రారంభమైనట్లు ఇరు దేశాలు అధికారికంగా తెలిపాయి.

 

భారత్, చైనా వాణిజ్యంతో హిమాచల్‌లోని ది షిప్కిలా పాస్, ఉత్తరాఖండ్‌లోని లిపులేక్ పాస్, సిక్కింలోని నాథులా మార్గాలు తెరుచుకున్నాయి. కోవిడ్ కారణంగా అప్పట్లో ఈ మార్గాలను మూసివేసింది భారత్ ప్రభుత్వం. ఆ తర్వాత ట్రేడర్లు డిమాండ్ చేసిన.. గాల్వాన్ ఘర్షణల కారణంగా ఆ మార్గాలను తెరవలేదు భారత్. కాగా, ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారంలో చైనా కంటే భారతే ఎక్కువ లబ్ధి పొందుతోంది.

 

ఇకపోతే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో భారత్, చైనా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆ సంబంధాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత్‌లో పర్యటించారు. చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటనలో ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన విషయాలను చర్చించారు. కాగా ఈ నెల చివరిలో ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు.

మరిన్ని కథనాలు:

India-Nepal: సరిహద్దు వాణిజ్యంపై నేపాల్ అభ్యంతరం.. ఖండించిన భారత్

Share This Post