భారత్ సమాచార్.నెట్: మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను గోవాలో కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. చిరు బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగగా చిరు తనయుడు రామ్ చరణ్ పంచుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చరణ్ షేర్ చేసిన వీడియోలో తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ కేక్ తినిపించి.. చిరు కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. చిరు కూడా చెర్రీకి కేక్ తినిపించి తనకున్న ప్రేమని తెలియజేశారు. చిరు, చెర్రీల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ పోస్టులను తెగ షేర్ చేస్తూ చిరుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇక చెర్రీ ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. నాన్న ఇది కేవలం మీ పుట్టిన రోజు మాత్రమే కాదు.. ఇది మీలాంటి వ్యక్తికి ఒక అద్భుతమైన వేడుక. నా హీరో, నా గైడ్, నా ప్రేరణ మీరే… నేను సాధించిన ప్రతి గెలుపు.. మోసే ప్రతి విలువ మీ నుండి వచ్చిందే. 70 ఏళ్ల వయస్సులో కూడా మీ వయస్సు ఇంకా యవ్వనంగా, స్ఫూర్తిదాయకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. మీ ఆరోగ్యం.. మీ సంతోషం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాని.. తనకు ఉత్తమ తండ్రిగా ఉన్నందకు ధన్యవాదాలు అంటూ చెర్రీ రాసుకొచ్చారు.
To Watch The Video Click The Link Below:
https://www.instagram.com/reel/DNpZSelP7Rm/?utm_source=ig_web_button_share_sheet
మరిన్ని కథనాలు: