భారత్ సమాచార్.నెట్: రాజ్యాంగంలోని 130వ సవరణ బిల్లు (ప్రజాప్రతినిధుల ఉద్వాసన బిల్లు)పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నేరారోపణలు ఎదుర్కొన్న నేతలు ఎంజాయ్ చేస్తూ జైలు నుంచి ఆర్డర్లు పాస్ చేసే రోజులు పోయాయన్నారు ప్రధాని మోదీ. తప్పు చేస్తే సీఎం అయనా.. పీఎం అయినా తొలగించేలా తమ ప్రభుత్వం బిల్లు తీసుకువస్తే.. దాన్ని విపక్షాలు వ్యతిరేకించడం సరికాదంటూ మండిపడ్డారు ప్రధాని.
అదే సమయంలో విపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో.. లేదంటే బెయిల్‌పై బయట ఉన్నారని విమర్శించారు. అందుకే ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎవరైన ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే.. తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు.. జైలు శిక్ష అనుభవించిన ఏ ముఖ్యమంత్రి అయినా.. ప్రధాన మంత్రి అయినా తన పదవిని ఎందుకు కోల్పోకూడదని? ప్రశ్నించారు ప్రధాని మోదీ.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లు ముందు అందరు సమానమేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రజాప్రతినిధుల బిల్లును ప్రవేశపెట్టారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా తీవ్ర నేరారోపణలతో అరెస్ట్ అయి 30 రోజులపాటు జైలులో ఉంటే వారిని వారి పదవి నుంచి తొలగించేలా ఈ బిల్లు రూపొందించింది కేంద్రం.
మరిన్ని కథనాలు:
CP RadhaKrishnan: ప్రధాని మోదీ సమక్షంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్