భారత్ సమాచార్, వెబ్ డెస్క్ : తెలంగాణలో రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద రూ.147.99 కోట్లను కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలయ్యే ఈ పథకం ద్వారా వ్యక్తిగత రైతులతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, మహిళా సంఘాలకు కూడా ప్రయోజనం కల్పించనున్నారు.
ఈ పథకంలో భాగంగా ట్రాక్టర్కు అనుసంధానించే బూమ్…



