భారత్ సమాచార్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రంతా ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, బుధవారం తెల్లవారుజాము నుంచే పరిస్థితిని పర్యవేక్షించారు. తుఫాన్ కారణంగా ముంపు ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్, రహదారులు సహా అత్యవసర సేవలను వేగంగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 84,396 మందిని 290 పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాన్…


