భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్‌లను మంగళవారం నెల్లికుదురు పోలీసులు అడ్డుకున్నారు. సీఐ సత్యనారాయణ, నెల్లికుదురు ఎస్‌ఐ గంగారపు కరుణాకర్, ఇనుగుర్తి ఎస్‌ఐ పి. నరేష్ పోలీస్ సిబ్బందితో కలిసి వారిని అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.

కవిత,…