భారత్ సమాచార్, హెల్త్: ప్రతీ ఉదయం ప్రతి ఒక్కరికీ ఎంతో ప్రత్యేకమైన సమయం. రోజును ఎలా ప్రారంభిస్తామో.. దాని ప్రభావం మన శరీరం, మనసుపై రోజంతా కనిపిస్తుంది. ఉదయం నిద్రలేవగానే కొన్ని మంచి అలవాట్లను పాటిస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడుతుంది. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు ఉదయం వేళను సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యం.

అయితే ప్రస్తుతం చాలామంది నిద్రలేవగానే ఫోన్ చేతిలోకి తీసుకుంటున్నారు. స్టేటస్‌లు, సోషల్ మీడియా అప్‌డేట్లు, సందేశాలు చూస్తూ ఉదయం సమయాన్ని గడిపేస్తున్నారు. ఇలా…