భారత్ సమాచార్, హైదరాబాద్ సెంట్రల్ డెస్క్: తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేశారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శ్రీమతి బండారు విజయలక్ష్మి నేతృత్వంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో “తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల…





