భారత్ సమాచార్, పోలవరం జిల్లా: విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద వరద ప్రవాహంలో విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నీలేష్ గల్లంతయ్యాడు. స్నేహితుల కళ్ల ముందే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడంతో మిగిలిన వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
హైదరాబాద్ నుంచి పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు విహారయాత్ర కోసం చింతూరు, మారేడుమిల్లి ప్రాంతాలకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరుగురు స్నేహితులు సోకిలేరు వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని స్నానానికి…



