భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. పండుగ సందర్భంగా ఆనందంగా సాగాల్సిన వేడుకలు ఒక్కసారిగా విషాదంగా మారడంతో పెద్దకంజర్లలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు విద్యార్థులు చెరువులోకి దిగినట్లు సమాచారం. చెరువులో గతంలో మట్టి తవ్వకాల కోసం తీసిన గుంతలు ఉండటంతో లోతైన ప్రాంతాన్ని విద్యార్థులు గుర్తించలేకపోయినట్లు…