భారత్ సమాచార్, డిజిటల్: నేటి రాశిఫలాలు
మేషం
మాతృ సంబంధిత ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగించవచ్చు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం ఎదురవుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలను వాయిదా వేసే పరిస్థితులు రావచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగులు అధికారులతో జరిపే చర్చల్లో ఆశించిన ఫలితాలు వెంటనే లభించకపోవచ్చు.
వృషభం
చేపట్టిన పనులు కొంత ఆలస్యమైనా చివరికి పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ…



