భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ పురపాలక సంఘం పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత ప్రమాణాల అమలును పరిశీలించేందుకు మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ చెరుకు సాయికుమార్ వివిధ హోటళ్లు, రెస్టారెంట్లను సందర్శించి అక్కడి పరిసరాలను, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. వినియోగదారులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందుతున్నదా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు.

అపరిశుభ్రతపై జరిమానా

తనిఖీల్లో భాగంగా నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు, అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించిన సిటీ ప్యాలెస్…