భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ నియోజకవర్గంలో కరువు పరిస్థితులతో ఎండిపోతున్న వరి పంటలను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జ్ బట్టి అజయ్ శనివారం పరిశీలించారు. మెదక్ మండలంలోని గుట్టకిందిపల్లి, శివాయపల్లి గ్రామాల్లో పర్యటించి, ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు. రైతులను కలిసి పంటల పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం జరిగేలా వారి సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.
ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు?
ఈ…






