భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఆదివారం ఘనంగా జరిగాయి. పూల పండుగను పురస్కరించుకుని మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

పూలతో అందంగా బతుకమ్మల అలంకరణ

తీరొక్క పూలతో గోపురాల తరహాలో బతుకమ్మలను పేర్చిన మహిళలు.. వాటి శిఖరంపై గౌరమ్మను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి…