భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండలం వల్లూరు గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. జాతీయ రహదారి–44 పక్కన సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు నార్సింగి ఎస్‌ఐ బీమరి సృజన తెలిపారు. మృతురాలి వివరాలు తెలియకపోవడంతో ఆమెను గుర్తించేందుకు పోలీసులు ప్రజల సహకారం కోరుతున్నారు. మహిళ మృతదేహం కనిపించిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు సంబంధిత వివరాలను సేకరించినట్లు సమాచారం. మృతురాలిని గుర్తించేందుకు ఆమె శారీరక లక్షణాలు, ధరించిన…