భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలో విజయదశమి వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ప్రజలు దసరా పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. గ్రామాల్లో ఉత్సవాల నిర్వహణకు సర్పంచులు, గ్రామపంచాయతీ పాలకమండళ్లు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలు సామూహికంగా తరలివెళ్లి పాలపిట్టను దర్శించుకున్నారు. ఆయా గ్రామాల్లోని బొడ్రాయిల వద్ద సనాతన సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించి పండుగను ఘనంగా జరుపుకున్నారు.
దసరా సందర్భంగా గ్రామాల్లో వేదమంత్రోచ్ఛారణల నడుమ షమీ పూజలు నిర్వహించారు. అనంతరం యువతతో పాటు…






