భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్నేహబంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన యువకులు. తమతో కలిసి చదువుకున్న స్నేహితురాలు బండారి దివ్య తండ్రిని కోల్పోయి విషాదంలో ఉన్న విషయం తెలుసుకున్న క్లాస్‌మేట్స్‌ ఆమె కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. కష్టకాలంలో స్నేహితురాలికి తోడుగా నిలవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చి తమ వంతు సాయం చేయడం పలువురిని ఆకట్టుకుంది.

ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన బండారి రాములు ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన కుమార్తె దివ్యతో పాటు కుటుంబ…