భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అణగారిన, బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన పండుగ సాయన్న ధైర్యసాహసాలు, తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సామాజిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన ఆయన పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
గురువారం మెదక్ కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్లో పండుగ సాయన్న జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్.. పండుగ…






