భారత్ సమాచార్, మెదక్ : ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి దర్శనానికి వచ్చి తప్పిపోయిన నాలుగేళ్ల బాలుడిని మెదక్ జిల్లా పోలీసుల క్యూ.ఆర్.టీ (క్విక్ రెస్పాన్స్ టీమ్) సిబ్బంది సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పోలీసులు సమయస్ఫూర్తితో స్పందించి చిన్నారిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల అప్రమత్తతపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.
బాన్సువాడకు చెందిన మోహన్, సంధ్య దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్తో కలిసి శుక్రవారం ఏడుపాయల అమ్మవారి…






