భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సేవలను గుర్తిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రశంసా పత్రాలను అందజేసింది. తెలంగాణ కోసం వారు చేసిన పోరాటాలు, అందించిన సేవలకు గౌరవంగా ఈ ప్రశంసా పత్రాలను అందించినట్లు పేర్కొన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన కృషిని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో వారి పాత్ర, సేవలను ప్రశంసా పత్రాల్లో…






