భార‌త్ స‌మాచార్, లైఫ్ స్టైల్ : ప్రతిరోజూ తలస్నానం చేయడం వల్ల జలుబు వస్తుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ముఖ్యంగా చల్లటి నీటితో స్నానం చేయడం, తడి జుట్టుతో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి హానికరమని భావిస్తుంటారు. అయితే, వైద్య నిపుణుల సమాచారం ప్రకారం జలుబు ప్రధానంగా వైరస్‌ల వల్ల వస్తుంది. రైనోవైరస్‌లు సాధారణ జలుబుకు ముఖ్యమైన కారణం. తలస్నానం చేయడం లేదా జుట్టు తడిగా ఉండటం వల్ల నేరుగా జలుబు వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవు. అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (CDC)…