భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రతకు గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (VICPC) కీలక పాత్ర పోషిస్తాయని చిన్ననాగారం సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు. పిల్లలపై జరిగే నేరాలు, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, శారీరక, మానసిక వేధింపులను అరికట్టడంలో ఈ కమిటీలు చురుకుగా పనిచేయాలని సూచించారు.
ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో శుక్రవారం గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌గా స్థానిక సర్పంచ్ చెడుపాక సుజాత యాకయ్య, కన్వీనర్‌గా దాసరి కవితతో…






