భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: సాధారణంగా ఎరుపు రంగులో కనిపించే మిర్చి పంటకు భిన్నంగా పసుపు రంగు మిరప సాగుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పన్యాల గ్రామానికి చెందిన రైతు మనోహర్ గౌడ్. తనకున్న ఎకరా 10 గుంటల వ్యవసాయ భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా ఎరుపు రంగు మిర్చితోపాటు, గత నాలుగేళ్లుగా పసుపు రంగు మిరప పంటను కూడా సాగు చేస్తున్నారు. గతంలో ఈ పంటకు మంచి ధర లభించడంతో ఈసారి కూడా ఆశతో సాగు చేపట్టినట్లు…