భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బాలల హక్కుల పరిరక్షణ, వారి భద్రత విషయంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలు (VCPC) కీలక పాత్ర పోషిస్తాయని రావిరాల గ్రామ సర్పంచి కత్తుల కళ్యాణి యాకాంతం తెలిపారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడంతోపాటు, వారిపై జరిగే అన్యాయాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో శనివారం ఐసీడీఎస్ నెల్లికుదురు సెక్టార్ సూపర్వైజర్ ఎన్. సరిత ఆధ్వర్యంలో స్థానిక UPSలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.…