భారత్ సమాచార్, తూర్పుగోదావరి జిల్లా: సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వడ్లమూడి సీత తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. చినకొండేపూడి, పెద్దకొండేపూడి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడిన వడ్లమూడి సీత.. తనకు మద్దతు తెలిపి సర్పంచ్‌గా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. గ్రామస్థులతో మమేకమవుతూ వారి అభిప్రాయాలు, స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి,…