భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగరంలో చేనేత కార్మికుడు గడిగే యువరాజు (43) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల భారంతో ఇంట్లో మగ్గానికి ఉరి వేసుకుని ఈ దారుణం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సంఘటన విన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా చేనేత అధ్యక్షుడు యంకే శివప్రసాద్ వెంటనే మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్‌తో కలిసి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. స్థానికులు, పార్టీ…