భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: హైదరాబాద్‌లో నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320సీ – లెర్న్ డిస్ట్రిక్ట్ అవార్డ్స్ 2025–26 కార్యక్రమంలో మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు లయన్ బొడ్డుపల్లి ఉపేంద్రం ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ అవార్డు అందుకున్నారు. క్రీడల అభివృద్ధికి, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ పురస్కారం మహబూబాబాద్ జిల్లా క్రీడా రంగానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని పలువురు అభిప్రాయపడ్డారు.

అవార్డు అందుకున్న అనంతరం బుధవారం మహబూబాబాద్‌లోని బొడ్డుపల్లి ఉపేంద్రం నివాసంలో అభినందన…