భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాత్రివేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని నిరసన వ్యక్తం చేస్తూ చిన్న నాగారం గ్రామానికి చెందిన BRS యువకులు శనివారం రాత్రి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న యువకులు కరెంట్ కోతలను నిరసిస్తూ నినాదాలు చేశారు.

కరెంట్ కోతలతో ఇబ్బందులు

సాయంత్రం, రాత్రి సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల గ్రామస్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఈ సందర్భంగా యువ నాయకులు తెలిపారు. సద్దుల బతుకమ్మ,…