భారత్ సమాచార్.నెట్: కర్ణాటక (Karnataka) ఉప ముఖ్యమంత్రి (Deputy CM), కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader) డీకే శివకుమార్‌ (DK Shivkumar) సైకిల్‌ దిగబోయి కిందపడ్డారు. బెంగళూరులోని విధాన సౌధ సమీపంలో సైకిల్ తొక్కుతూ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సరదా వ్యాఖ్యలతో పాటు, ఆయన ధరించిన ఖరీదైన శాలువాపైనా, నగరాల్లో మౌలిక వసతులపైనా నెటిజన్‌లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 పురస్కరించుకుని ఏర్పాటు చేసిన…