భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నర్సాపూర్ పట్టణంలో ‘రాజన్న ఎంప్లాయ్‌మెంట్ సెల్’ ఆఫిషియల్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పేజీతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, రాజన్న ఫౌండేషన్ ఛైర్మెన్ ఆవుల రాజిరెడ్డి అధికారికంగా ప్రారంభించారు. భారత్ ఉద్యోగ్ సంయుక్త సహకారంతో ప్రారంభమైన ఈ ఎంప్లాయ్‌మెంట్ సెంటర్ ద్వారా ఉద్యోగాల భర్తీ, కెరీర్ మార్గదర్శక సేవలు, వృత్తి నైపుణ్య శిక్షణ సేవలను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్…