భారత్ సమాచార్, హైదరాబాద్: తెలంగాణ జానపద పాటల గాయకుడు, రచయిత రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ 1989, ఆగస్టు 22న హైదరాబాదులోని దూల్‌పేటలో జన్మించాడు. లయోల హైస్కూల్ లో ఉన్నత విద్యను, నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తిచేశాడు. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్‌లో ప్రాచూర్యం పొందిన రాహుల్, 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాటతో సినిమారంగంలోకి ప్రవేశించాడు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ కలిసి పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, 2023 మార్చ్ 13న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌కు 2025 బోనాల పండగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు రాహుల్ సిప్లిగంజ్ బర్త్ డే.
మరిన్ని కథనాలు: