భారత్ సమాచార్.నెట్: పార్లమెంట్‌లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శుక్రవారం (ఆగస్ట్ 22) ఓ ఆగంతకుడు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. పార్లమెంట్ ప్రాంగణంలోని రైల్ భవన్ గోడ దూకి పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే చెట్టు సహాయంతో గోడ ఎక్కి పార్లమెంట్‌లోకి ప్రవేశించిటన్లు భద్రతా వర్గాలు తెలిపాయి. రైల్ భవన్ వైపు నుండి గోడ దూకి నూతన పార్లమెంట్ భవనం గరుడ్ గేట్ వరకు ఆ ఆగంతకుడు చేరుకువడంతో.. పార్లమెంట్‌లోపల ఉన్న భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులికి తీసుకుని విచారిస్తున్నట్లు సదురు వర్గాలు వెల్లడించాయి. ఇక అరెస్ట్ చేసిన ఆ వ్యక్తి మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు తేలింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజే ఈ సంఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే గతంలో కూడా పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 2023లో శీతాకాల సమావేశాల సమయంలో లోక్‌సభలోని పబ్లిక్ గ్యాలరీలో కూర్చున్న కొందరు వ్యక్తులు సభలోకి దూకి గందరగోళం సృష్టించిన సంగత తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని కథనాలు: