భారత్ సమాచార్.నెట్, శ్రీలంక: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ నిధులను వ్యక్తిగత ప్రయానాలకు ఉపయోగించుకున్నారన్న ఆరోపణలపై ఆయను సీఐడీ ఇవాళ అదుపులోకి తీసుకుంది. రణిల్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన భార్య ప్రొఫెసర్ మైత్రీ విక్రమసింఘే స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రణిల్ ప్రభుత్వ ఖజానాను ఉపయోగించారన్న అభియోగాలు ఉన్నాయి.
అయితే లండన్‌లోని వాల్వర్హాంప్టన్ యూనివర్సిటీ గ్రాడ్యూయేషన్ డేలో పాల్గొనేందుకు ప్రభుత్వ నిధులు వినియోగించలేదని విక్రమసింఘే వాదించినప్పటికీ.. సీఐడీ మాత్రం ఆయన వాదనను తోసిపుచ్చుతూ తాజాగా అరెస్ట్ చేసింది. విచారణ కోసం కొలంబోలోని సీఐడీ ఆఫీస్‌కు పిల్వగా.. విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసింది. తగిన ఆధారాలు ఉండటంతోనే ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన సీఐడీ త్వరలో ఆయనను కోర్టు ముందు ప్రవేశపెడుతామని వెల్లడించింది.
ఇకపోతే 2022 తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక ప్రజల నిరసనలతో అట్టుడికిన సంగతి తెలిసిందే. అప్పటి ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్స్ రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. దీంతో రణిల్ విక్రమసింఘే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీలంక ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు కీలక పాత్ర పోషించారు రణిల్. కానీ గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో వామపక్ష నేత అనుర కుమార దిసనాయకే చేతిలో రణిల్ ఓటమి పాలయ్యారు.
మరిన్ని కథనాలు: