భారత్ సమాచార్.నెట్, ఢిల్లీ: వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ తీర్పును సవరించింది సుప్రీం ధర్మాసనం. షెల్టర్ హోమ్‌కు తరలించిన కుక్కలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రేబిస్ ఉన్న కుక్కలను మాత్రమే షెల్టర్లకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే మున్సిపల్ వార్డులల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కల నియంత్రణ కోసం పనిచేసే అధికారులకు ఎవరైనా అడ్డుతగిలితే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ జంతు ప్రేమికులు ఎవరైనా వీధి కుక్కలను పెంచుకోవాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి దరఖాస్తు చేసుకోవాలని సుప్రీం సూచించింది.
ఇకపోతే ఆగస్ట్ 11న వీధి కుక్కల దాడిలపై సుమోటోగా దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీం.. ఢిల్లీ, ఎన్సీఆర్ వీధుల నుండి అన్ని కుక్కలను 8 వారాలల్లో తరలించాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుప్రీం తీర్పుపై పలువురు అభ్యంతర వ్యక్తం చేశారు. జంతు ప్రేమికులు సీజేఐ బీఆర్ గవాయ్ కూడా వినతులు ఇచ్చారు. దీంతో ఈ కేసుపై పున: పరిశీలిస్తామని సీజేఐ హామి ఇచ్చారు. తాజాగా ఈ కేసుపై విచారణించిన ధర్మాసనం తొలుత ఇచ్చిన తీర్పును సవరించింది.
మరిన్ని కథనాలు:
CJI: వీధి కుక్కల తొలగింపు తీర్పుపై స్పందించిన సీజేఐ బీఆర్ గవాయ్