భారత్ సమాచార్, భద్రాద్రికొత్తగూడెం జిల్లా: లక్ష్మీదేవిపల్లి మండలంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని బంగారుచెలక గ్రామపంచాయతీ పరిధిలోని మాలగూడెం గ్రామానికి చెందిన కోడిరెక్కల సుధీర్(25) గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఓ ముగ్గురు వ్యక్తులు తన చావుకు కారణం అంటూ సూసైట్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తనకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తూ మానసిక ఆవేదన గురి చేశారని, తను ఏ తప్పు చేయలేదని, ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిస్తే వాళ్లకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక భయాందోళనతోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని కథనాలు: