భారత్ సమాచార్, సినీ టాక్స్ ; ప్రముఖ నటుడు రాజా రవీంద్ర, శివకుమార్, యశస్విని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘సారంగదరియా’. ఈ మూవీ నుంచి ప్రముఖ సినీ గాయని కె.ఎస్. చిత్ర ఆలపించిన గీతాన్ని లిరికల్ వీడియో గా నెట్టింట విడుదల చేశారు. ‘అందుకోవా… ఆకాశం అదిగో…అంత సులువా అనుకుంటే అవదే… పొందలేవా అవకాశం ఇదిగో…’ అంటూ సింపుల్ మెలోడీగా పాట సాగుతోంది. గీతానికి చిత్ర గానం హైలెట్ గా నిలిచింది. బ్యూటిపుల్ మెలోడిగా సంగీత ప్రియులను అలరిస్తోంది ఈ పాట.
ఉమాదేవి ఈ చిత్రానికి నిర్మాత. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఎబినేజర్ పాల్ సంగీత దర్శకత్వం వహించాడు. కథనంతో పాటుగా సినిమా ఎమోషన్స్ ని క్యారీ చేస్తోంది గీతం. ఈ చిత్రాన్ని వేసవి చివరికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.