భారత్ సమాచార్, ఏపీ: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ కాకినాడ వైపు దూసుకొస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. తుపాన్ ను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. రాబోయే 24 గంటల్లో తుపాను బలపడే అవకాశం ఉందని.. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్ల డించింది. ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్కి 610కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్టణానికి 850 కి.మీ, కాకినాడకు 840 కి.మీ, గోపాలపూర్కు 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ…