భారత్ సమాచార్.నెట్, ములుగు : జిల్లాలో శాంతిభద్రతలను కాపాడటం, నేరాలకు శిక్షలు పడేలా చూడటంతో పాటు రాబోయే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ డా.శబరిష్ అధికారులకు స్పష్టం చేశారు. ఈరోజు (29.09.2025) జిల్లా కేంద్రంలో జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనందున, అధికారులు అప్రమత్తంగా ఉండి, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలని ఆదేశించారు.
ఎన్నికల సందర్భంగా డబ్బు, మందు పంపిణీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టు…





