భార‌త్ సమాచార్, సినిమా : బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ మైథలాజికల్ మూవీ ‘రామాయణం’ ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటి వారం నుంచే భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ చిత్రం తాజాగా రూ.1,000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటించారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజే సుమారు రూ.128 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి తన సత్తా…