భార‌త్ సమాచార్, తెలంగాణ‌ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బుడుగుల గూత్తికోయ గ్రామంలో మూఢనమ్మకాలు ఒకే కుటుంబంలో నలుగురి ప్రాణాలను బలిగొన్నాయి. చేతబడి చేస్తున్నారనే అపోహతో కొందరు దుండగులు ఇద్దరు వృద్ధులను కర్రలతో కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేయగా, వారిని చంపినవారే తమను కూడా అంతమొందిస్తారనే తీవ్ర భయంతో మృతుడి కుమారుడు, కోడలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరుస మరణాలతో మారుమూల అటవీ ప్రాంతమైన బుడుగుల గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. బుడుగుల గ్రామానికి చెందిన పద్దం…