భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సంగారెడ్డికి చెందిన ఆయుర్వేద, యునాని, హోమియోపతి వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఉచితంగా వైద్య పరీక్షలు
శిబిరానికి హాజరైన విద్యార్థులు, స్థానికులకు వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
ఆయుర్వేదం, యునాని, హోమియోపతి వైద్య…






