భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో నకిరేకల్ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నకిరేకల్‌లోని పెద్ద చెరువు వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, నిర్వాహకులు, యువతకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, సంబంధిత అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్ద చెరువు వద్ద ప్రత్యేక భద్రత
పెద్ద చెరువు వద్ద నిమజ్జన ప్రాంతాన్ని అధికారులు ప్రత్యేకంగా…






