భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఐసీడీఎస్ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ సూచించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.
పోషణ మాసోత్సవంలో పాల్గొన్న సర్పంచి
మండలంలోని హనుమాన్ నగర్ తండా పరిధిలోని ధాన్య తండాలో సంబంధిత సెక్టార్ ఆధ్వర్యంలో మంగళవారం పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా…






