భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: హనుమాన్ నగర్ తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, తండా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ స్పష్టం చేశారు. మండలంలోని హనుమాన్ నగర్ తండాలో సర్పంచి అశోక్ కుమార్ అధ్యక్షతన బుధవారం గ్రామసభ నిర్వహించారు.
సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చిన తండావాసులు
గ్రామసభలో హనుమాన్ నగర్ తండా పరిధిలోని వివిధ తండాలకు చెందిన ప్రజలు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.…






