భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు భక్తులచే తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకుని బుధవారం గంగమ్మ ఒడికి చేరారు. మండల కేంద్రం వెన్నుగొడితితో పాటు వివిధ గ్రామాల్లో సంబంధిత విఘ్నేశ్వర ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్వామివారి విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.
చిన్ననాగారంలో వైభవంగా శోభాయాత్ర
మండలంలోని చిన్ననాగారం హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన…






